ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్

By Ravi
On
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ (డిశ్చార్జ్ చేస్తూ) గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోగా మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆ తీర్పు ప్రభావం పడకుండా స్వతంత్రంగా ఈ విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా 2022 సంవత్సరంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను అనుమతించి, ఆమెకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చడంతో శ్రీలక్ష్మికి మళ్ళీ చిక్కులు తప్పేలా లేవు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ 2025  పోటీలకు సర్వం సిద్ధం మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు