లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు

By Ravi
On
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్  కేసుల నిర్వహణపై సదస్సు

దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో “లోప రహిత క్రమశిక్షణ మరియు అప్పీల్ (డి.ఏ.ఆర్)  కేసుల నిర్వహణIMG-20250507-WA0212 ” అనే అంశంపై ఉపన్యాసాన్ని నిర్వహించింది.  విజిలెన్స్ బ్రాంచ్ సామర్థ్య నిర్మాణ చొరవలో భాగమైన “ఫోర్టిఫై లెక్చర్ సిరీస్” కింద ఇది మూడవ   ఉపన్యాసం.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, గౌరవ అతిథిగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్ , దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్  జె. వినయన్, ఇతర సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కోఆర్డినేట్ & జనరల్ మేనేజర్ కార్యదర్శి మల్లాది శ్రీనివాస్ ముఖ్య వక్తగా హాజరై "డిఎఆర్ కేసు లోపాలు లేని నిర్వహణ" అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసంను కొనసాగిస్తూ, మల్లాది  శ్రీనివాస్, భారతీయ రైల్వేలలో డి.ఏ.ఆర్ (క్రమశిక్షణ మరియు అప్పీల్ రూల్స్) చర్య రైల్వే ఉద్యోగులలో క్రమశిక్షణను కాపాడటానికి, నైతిక ప్రమాణాలను కాపాడటానికి మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి కీలకమైన సాధనాల్లో ఒకటి అని పేర్కొన్నారు. డి.ఏ.ఆర్ కేసులను ప్రాసెస్ చేసేటప్పుడు మరియు విచారణ నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన సరైన విధానాలపై అవగాహన చాలా ముఖ్యమైనది. తరచుగా, క్రమశిక్షణా చర్యల సమయంలో జరిగే విధానపరమైన లోపాల వలన  అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి ముగింపు చర్య తీసుకోలేకపోతాయని తెలిపారు. ఈ ఉపన్యాసం ప్రధానంగా దోషరహిత క్రమశిక్షణా చర్యలను  చేపట్టడంపై  అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దోషరహిత ఛార్జ్ షీట్లను తయారు చేయడం, ప్రస్తుతం ఉన్న నియమాలను పాటించడం, విచారణలు నిర్వహించడానికి సరైన విధానాలు మరియు జరిమానాలు విధించడం వంటి అంశాలపై చర్చించారు. క్రమశిక్షణా చర్యల నిర్వహణలో గుర్తించబడిన అవకతవకలపై వివిధ కేసు చట్టాలు కూడా చర్చించబడ్డాయి. చట్టపరమైన వేదికలలో కోర్టు కేసు జరుగుతున్నప్పుడు విధానపరమైన లోపాలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు క్రమశిక్షణా చర్యలను ఎలా నిర్వహించాలో పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు. ఈ ఉపన్యాసంలో పాల్గొన్నవారి జ్ఞానాన్ని మెరుగుపరచడంలో మరియు ఈ అంశంపై వారి అవగాహనను పెంచడంలో ఈ సెషన్ చాలా ప్రయోజనకరంగా ఉంది. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, క్రమశిక్షణ మరియు అప్పీల్ నియమాలు (డి.ఏ.ఆర్) అంశం చాలా విస్తృతమైనది, సున్నితమైనది మరియు వ్యవహరించడానికి చాలా అనుభవం మరియు నైపుణ్యం అవసరమని అన్నారు. ఈ సెషన్ డి.ఏ.ఆర్ కేసులను పరిష్కరించే అధికారులు మరియు సిబ్బందికి చాలా ఉపయోగకరంగా మరియు విద్యావంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డి.ఏ.ఆర్ కేసును పరిష్కరించేటప్పుడు డీలర్ తప్పులు  లేకుండా తగు జాగర్తలను తీసుకోవాలని  కూడా ఆయన తెలియజేశారు. విజిలెన్స్ ఎల్లప్పుడూ ప్రీవెన్టివ్ పాజిటివ్ ధృక్పధంగా ఉండాలి, శిక్షాత్మకంగా ఉండకూడదు అని ఆయన పేర్కొన్నారు.  ఈ దిశలో దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ బృందం అధికారులు మరియు సిబ్బందిలో అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తూ 'ఫోర్టిఫై లెక్చర్ సిరీస్' నిర్వహించడం ద్వారా పనిలో పారదర్శకతను ప్రోత్సహించడానికి మరియు సంస్థ కూడా అపారమైన ప్రయోజనాలను పొందుతుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది మరియు అధికారుల ప్రయోజనం కోసం ఉపన్యాస శ్రేణిని నిర్వహించడంలో విజిలెన్స్ బ్రాంచ్ చేసిన కృషిని దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగ్రవాల్ అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె. వినయన్ క్రమశిక్షణా చర్యలను నిర్వహించడంలో కనిపించే కొన్ని సాధారణ అవకతవకలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. మరియు అనుసరించాల్సిన సరైన విధానాల గురించి తమను తాము అవగాహన చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పాల్గొన్న వారిని కోరారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ 2025  పోటీలకు సర్వం సిద్ధం మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు