55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
అన్ని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు..సమీక్షలో సీఎం ఆర్డర్
కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమావేశము నిర్వహించారు. సమావేశము అనంతరము సీపీ సి.వి. ఆనంద్ ఐపిఎస్ డిజి ముఖ్యమంత్రి ఆదేశానుసారము మీడియాకు వివరించారు. ఆపరేషన్ సింధూర్ అప్రమత్తత చర్యల్లో భాగంగా కేంద్ర హోమ్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దేశంలోని అందరిని అప్రమత్తం చేసిందని మరియు ఆపరేషన్ అభ్యాస్ ప్రారంభించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని, వారిని మానసికంగా, శారీరకంగా యుద్ధ పరిస్థితిని ఎదుర్కునేందుకు సన్నద్ధం చేయాలని తెలిపిందన్నారు. ఇటువంటి సన్నాహక చర్యలతో ప్రజలకు అలవాటు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ రోజు అన్ని శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్స్ ఏ విధంగా చేయాలనేది నిర్ణయించి, హైదరాబాదులోని నాలుగు ప్రాంతాలలో మాక్ డ్రిల్స్ చేశామన్నారు. దీనిపై అన్ని శాఖలకు అప్రమత్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాలుగు గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఒక సందేశాన్ని పంపారు. అక్కడ వార్ సైరన్లు మోగాయి . దాదాపు 55 సంవత్సరాల తర్వాత మొదటిసారి వార్ సైరన్లను వాడాల్సి వచ్చింది. రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది. అనంతరం ప్రజలు ఎలా వ్యవహరించాలని వారికి అక్కడి అధికారులు నేర్పించారు. సైరన్ మోగినప్పుడు ప్రజలు ఇళ్లలో ఉన్న వారు ఇళ్లకే పరిమితం కావాలని బయట ఉన్నవారు బిల్డింగ్, ఇతర షెల్టర్లకు వెళ్లాల్సిందిగా కోరారు.
వాహనాలపై వెళ్లేవారు వాటిని ఎక్కడైనా ఆపి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పడం జరిగింది. సాయంత్రము నాలుగు గంటల తర్వాత 15 నిమిషాలకే మళ్ళీ ఒక సైరన్ కమాండ్ కంట్రోల్ నుండి మోగించారు. 4 ప్రాంతాల్లో అవి గోల్కొండ, కాంచన్ బాగ్, సికింద్రాబాద్, ఎన్ఎఫ్సీ లలో దాడులు జరిగాయని సందేశాన్ని పంపారు. తరువాత ఈ నాలుగు ప్రాంతాల్లో జరిగే మాక్ డ్రిల్స్ లో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్యశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసి సహా వివిధ శాఖల అధికారులందరూ ఎవరెవరు ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భాగంగా సీఎం ఇవాల్టి నుంచి కొంతకాలం వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నామని, అందరూ విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు . సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు జరగకుండా కట్టడి చేయాలని సీఎం కోరినట్లు, తప్పుడు వార్తల ద్వారా కొంతమంది ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిపారు . వైద్యశాఖ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అందరూ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆయా శాఖలపై రివ్యూ చేసుకోవాలని చెప్పారు. ఎన్డిఆర్ఎఫ్ శాఖ సామాగ్రి సరిగ్గా పని చేస్తుందా లేదా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నోడల్ ఆఫీస్ గా ఉంటుంది. ఇక్కడి నుంచే పర్యవేక్షణ ఉంటుంది అని తెలిపారు, రాష్ట్రంలోని ముఖ్యమైన సంస్థల దగ్గర భద్రత చర్యలను, పెట్రోలింగ్ ను పెంచాలన్నరు తెలిపారు. ఎంబసీల వద్ద భద్రత పెంచాలని సీఎం ఆర్డర్ వేశారు. రేపు భద్రతా ధళాలకు సంఘీభావంగా మెడికల్ హెల్త్, ట్రాన్స్పోర్ట్, ghmc, పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో సెక్రేటరియేట్ నుండి నెక్లెస్ రోడ్డు వరకు సాయంత్రము 6 గంటలకు ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు . ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. సివి ఆనంద్ ఐపిఎస్ డిజి సిపి హైదరాబాదు, రవి గుప్త ఐపిఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ టు హోమ్, వై.నాగి రెడ్డి ఐపిఎస్, డిజి ఫైర్ సర్వీస్, విక్రమ్ సింగ్ మాన్ ఐపిఎస్ అడిషినల్ సిపి లా ఆండ్ ఆర్డర్, బి.కమలాసన్ రెడ్డి ఐసిసిసి ఇంచార్జ్ మరియు పుష్ప డిసిపి ఐసిసిసి మాక్ డ్రిల్ ను కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రర్యవేక్షించి తగు సూచనలు ఇచ్చారు. పుకార్లు నమ్మ వద్దని ప్రజల్ని కోరుతున్నామని మరియు ఏదైనా సహాయం కావాలన్నా, సమాచారము ఉన్నా డయల్ 100, 112కు ఫోన్ చేయొచ్చు అని సీపీ సి.వి. ఆనంద్ కోరారు.