నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ..
సోనియా గాంధీ, రాహుల్ లకు రౌస్ అవెన్యూ కోర్టు లేటెస్ట్ గా నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు నిందితులకు కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నోటీసులు వారి పేర్లపై దాఖలైన చార్జ్‌షీట్‌పై కోర్టు వాదనలు వినేందుకు ఇచ్చినవిగా పేర్కొంది. ఈ విషయమై కోర్టు తెలిపిన ప్రకారం.. ఈ కేసు సంబంధించి ఇప్పటికే చార్జ్‌షీట్‌లో ఉన్న లోపాలను తొలగించారని పేర్కొంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే.. భారతీయ నగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 223 ప్రకారం నోటీసులు జారీ చేయాలా అనే అంశమేనని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసును తదుపరి విచారణ 2025 మే 8 కు వాయిదా వేసారు. అయితే, ఈ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కోర్టు ముందు వాదనలు వినిపించే హక్కు ఉందని కోర్టు స్పష్టంగా తెలిపింది.
అలాగే నెక్ట్స్ దశలలో న్యాయమైన విచారణ కోసం ఈ హక్కు కీలకమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ దశలో ఆరోపణలపై వాదనలు వినడమే న్యాయపరమైన న్యాయ విచారణకు ప్రాణం పోసే అంశమని కోర్టు పేర్కొంది. ఇక ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తెలిపిన విషయమేమిటంటే.. ప్రస్తుత దశలో నోటీసుల జారీకి ఈడీ వ్యతిరేకం కాదని, న్యాయపరమైన విచారణ సూత్రాలను మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ ప్రకారం రూ. 2,000 కోట్లకు పైగా విలువ ఉన్న ఆస్తులను కేవలం రూ. 50 లక్షలతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.