నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్
By Ravi
On
నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దుండగులు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా లోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రెండు ఆటోలు 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Tags:
Latest News
01 May 2025 22:08:14
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...