రాచకొండ కమిషనరేట్ లో సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు
By Ravi
On
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు, సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనునిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కళ్లు, రక్త పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు సొలీస్ ఐ కేర్ వంటి ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్లో రెండు రోజులకు ఒకసారి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సుధీర్ బాబు తెలియజేశారు.
Tags:
Latest News
01 May 2025 21:24:02
హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు గురువారం తీవ్ర అంతరాయం నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 20 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు...