బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!

By Ravi
On
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!


హైదరాబాద్ TPN : బోరబండ సెంట్రీ వీకర్ సెక్షన్ నుంచి నవభారత్‌నగర్ కాకతీయ హిల్స్‌కి వెళ్లే రహదారిలో రేకులతో కొంతమంది వ్యక్తులు అడ్డుకంచె ఏర్పాటు చేశారు. ఈ అడ్డుకంచె వేసి దాదాపు పది రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ జిల్లా కన్వీనర్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సతీష్‌చారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ వీకర్ సెక్షన్‌కు సంబంధించిన పలువురు బస్తీవాసులు.. హైటెక్ సిటీ ఐటీ కంపెనీలలో హౌస్‌కీపింగ్, ఆఫీస్‌బాయ్, ఇతర ఉద్యోగాలు చేసే మహిళలు ఈ నడకదారినే వెళతారని చెప్పారు. అలాంటి రోడ్డుకు అడ్డుకంచ వేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ చూపి అడ్డుకంచెని తొలగించేలా చూడాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే.. పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సతీష్ చారి, వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, మల్లేష్ నాయక్, గిరీష్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!