టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ

By Ravi
On
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ

తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) జనరల్‌ మేనేజర్‌గా గుండమనేని శ్రీనివాస్‌రావు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ పొందిన జీఎం అబ్రహం‌కు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ చెవ్వూరు హరి కిరణ్‌ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ హరి కిరణ్‌ మాట్లాడుతూ, టీజీబీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌గా గుండమనేని శ్రీనివాస్‌ సమర్ధవంతంగా విధులను నిర్వహించి కార్పొరేషన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన అబ్రహం ప్రశాంతమైన రిటైర్డ్‌ జీవితం గడపాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్లు బి.ంశా, సి.హెచ్‌. ప్రమోద్‌, తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి, టీజీబీసీఎల్‌ ఉద్యోగుల సంఘం నాయకుడు జీటి జీవన్‌, జి. సురేందర్‌, హన్మంతు, గుడ్డు శ్రీనివాస్‌, రవి, పుష్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం