ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
By Ravi
On
పదవ తరగతి ఫలితాల్లో పాతబస్తీ నుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన చాంద్రాయణగుట్ట విద్యార్థిని డి. హేమలత స్కూల్ టాపర్ గా 508 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 9వ తరగతిలో ఇదే పాఠశాల నుండి రాజస్థాన్‌లో జైపూర్ లో జరిగిన అండర్ 17 బాలికల విభాగంలో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించింది. ఆటలో ప్రథమ స్థానం అదేవిధంగా చదువులో కూడా ప్రధాన స్థానం రెండిట్లో అగ్రస్థానంలో ఉండటం చాలా గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. లక్ష్మణ్ సింగ్ మరియు ఫిజికల్ డైరెక్టర్ వి శ్రీను నాయక్ అభినందించారు. ఎంతో కష్టపడి ఆటల్లో చదువుల్లో పాఠశాల లీడర్ గా మంచి లక్షణాలు కలిగి ఉన్న ఈ విద్యార్థిని అన్నారు. అదేవిధంగా ఇకపై పై చదువుల గురించి గాని ఆటల గురించి గాని ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
Tags:
Latest News
01 May 2025 22:08:14
బీజేపీ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...