ఉద్యమకారులపై జులుం చెలాయిస్తే ఊరుకునేది లేదు..
మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
తెలంగాణ ఉద్యమకారులపై జులుం చెలాయిస్తే సహించేది లేదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉద్యమకారుడు శుభ ప్రద్ పటేల్ అధికారులకు హెచ్చరించారు. తాండూరు మాత శిశు సంక్షేమ ఆస్పత్రి ముందున్న మొయిజ్ అనే ఉద్యమకారుడి టిఫిన్ సెంటర్ ని తొలగించడం అన్యాయమని ఆయన తెలిపారు. టిఫిన్ సెంటర్ ను తొలగించిన ప్రాంతాన్ని శుభప్రద పటేల్ పలు కలిసి పరిశీలించారు. ఎవరి డబ్బాలు తొలగించకుండా కేవలం మొయిజు డబ్బాను తొలగించడం కక్షపూరిత వ్యవహారమేనని శుభప్రద పటేల్ తప్పు పట్టారు. ఈ సందర్భంగా తాండూర్ సబ్ కలెక్టర్ తో ఆయన .. ఫోన్లో ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమకారులపై కక్ష సాధింపు చర్యల పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పొట్టకూటికోసం సెంటర్ నడిపించుకుంటే అధికారులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే తొలగించిన డబ్బాను ఏర్పాటు చేయకపోతే ఉద్యమకారులు అందరితో కలిసి యాలల తహసిల్దార్ ఆఫీస్ను ముట్టడిస్తామని ఆయన తెలిపారు. మొయిజ్ కుటుంబని పరామర్శించిన ఉద్యమకారులు భాను , రామకృష్ణ , అబిద్ చావుస్ , ఫిరోజ్ ఖాన్ , వాజీద్ , మహేష్ శ్రీధర్ , మైనారిటీ హక్కుల పోరాట సమితి నాయకులూ సాదిక్ , సామీ , ముస్తఫా ఉన్నారు