జాతీయ పతాకం కోసం ప్రాణాలర్పించిన సామా జగన్‌మోహన్ రెడ్డికి నివాళ్లు..

By Ravi
On
జాతీయ పతాకం కోసం ప్రాణాలర్పించిన సామా జగన్‌మోహన్ రెడ్డికి నివాళ్లు..

మేడ్చల్  TPN : చింతల్ లో  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చింతల్ శాఖ అధ్వర్యంలో చైతన్య కాలేజ్ లొ సామా జగన్‌మోహన్ రెడ్డి వర్ధంతి సదర్భంగా వారిని స్మరించుకోవడం జరగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాని ఎదిరించి ప్రాణాలర్పించిన మొట్టమొదటి జాతీయవాది సామా జగన్‌మోహన్ రెడ్డి.1980వ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్‌ఛాన్సలర్, ప్రొఫెసర్ల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా RSU కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ దేశద్రోహాన్ని సహించలేక సామా జగన్మోహన్ రెడ్డి RSU కార్యకర్తల చేతిలో నుంచి జాతీయ పతాకాన్ని లాక్కొని ఎగురవేశారు. ‘వందేమాతరం’, ‘భారత్‌మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు.ఇలా రెండు సంవత్సరల తర్వాత 1982 లో ఏప్రిల్ 29న కోర్టు కేసుకు హాజరై వస్తున్న జగన్మోహన్‌ రెడ్డిని హనుమకొండ ప్రధాన రహదారి పై అత్యంత క్రూరంగా నక్సలైట్లు హత్య చేశారు.త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి జాతి గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో ప్రాణాలర్పించిన యువకిశోరం.ఇలాంటి వారి కోసం విద్యార్థులు నిరంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారిని స్మరించుకుంటూ భారత్ మాత సేవలో నిమగ్నమై ఉండాలి అని కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో  రాష్ట్ర  ఎస్ ఫ్ ఎస్ కన్వీనర్ మృత్యుంజయ,నగర సంయుక్త కార్యదర్శి మహేష్,దివ్య , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆస్పత్రి నుండి  శ్రీ తేజ్ డిశ్చార్జ్ సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆస్పత్రి నుండి శ్రీ తేజ్ డిశ్చార్జ్
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల...
హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్
యాదాద్రి కాటపల్లి ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. నలుగురికి గాయాలు
ఉద్యమకారులపై జులుం  చెలాయిస్తే ఊరుకునేది లేదు..
వరి ధాన్యం రైతుల  అవస్థలు..
జాతీయ పతాకం కోసం ప్రాణాలర్పించిన సామా జగన్‌మోహన్ రెడ్డికి నివాళ్లు..
ఈత చెట్టుపై పిడుగు..