ఈత చెట్టుపై పిడుగు..
By Ravi
On
వీడియో చిత్రీకరించిన స్థానికులు
వికారాబాద్ జిల్లాలో పిడుగు పడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూర్ మండలం కొత్త్లాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. వర్షం పడే క్రమంలో భారీ శబ్దం వినిపించింది. గ్రామం లో ఓ ఈతచెట్టు పై పిడుగు పడినట్లు స్థానికులు గుర్తించారు. పిడుగు పాటుతో ఈత చెట్టుపై మంటలు చెలరేగాయి. చెట్టుపై పడిన పిడుగు పాటును స్థానికులు సెల్ ఫోన్లలో వీడియో తీశారు. పిడుగు పడిన తరువాత ఈత చెట్టు పూర్తిగా కాలిపోయింది. మరోవైపు పిడుగు పాటుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెట్టుపై పడింది సరిపోయింది కాని ఇండ్లపై, ప్రజలపై పడి ఉండే భారీ నష్టం జరిగి ఉండేందని ఆందోళన చెందారు.
Related Posts
Latest News
29 Apr 2025 22:30:48
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల...