మమత హాస్పిటల్‌లో అరుదైన శస్త్ర చికిత్స..!

By Ravi
On
మమత హాస్పిటల్‌లో అరుదైన శస్త్ర చికిత్స..!

హైదరాబాద్‌ TPN :

హైదరాబాద్‌బాచుపల్లి మమత హాస్పిటల్‌లో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. 50 ఏళ్ల ఎల్లమ్మ అస్వస్థతకు గురై పలు హాస్పిటల్స్‌కు తిరిగారు. ఐతే.. ఎక్కడా ఆమె సరైన ట్రీట్‌మెంట్‌ దొరకలేదు. చివరగా మమత హాస్పిటల్‌కు రావడంతో.. అక్కడ ఆమె ఓవరీస్‌కి అతిపెద్ద ఒవేరియన్ సిస్ట్ ఉందని నిర్ధారించారు. శస్త్రచికిత్స చేయవలసి వస్తుందని తెలిపారు. ఆమెకు గుండె సమస్య ఉండటం వల్ల శస్త్రచికిత్స చేయడం కష్టమని తెలిసినా.. డాక్టర్ మైత్రీ మరియు ఆమె టీమ్‌ పూర్తి ఎబ్డోమినల్ హై స్టెరాటమీ, బైలేటరీల్ సెల్ఫీన్‌గో ఓపీహెరాటమీ శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడగలిగారు. ఈ శస్త్ర చికిత్సకు అనస్తీషియా విభాగం నుంచి డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ భువన్.. కార్డియాలజీ విభాగం నుంచి డాక్టర్ సాంబశివరావు బృందం సహాయపడ్డారు. ఇటువంటి కష్టమైన శస్త్రచికిత్సలు మామ్స్ హాస్పిటల్‌లో సామాన్యులకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయని చెప్పారు. తమ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్‌రాజ్ మామ్స్ హాస్పిటల్‌లో సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. మమత హాస్పిటల్ ప్రజలందరికీ ఉపయోగపడాలన్నారు. శస్త్రచికిత్స విభాగంలో డాక్టర్ మైత్రి, డాక్టర్ శైలజ, డాక్టర్ ఆమని, డాక్టర్ ఉషా నాగ్ చేసిన కృషిని కొనియాడారు.

Tags:

Advertisement

Latest News

రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయుసీ నేతలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.  ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకుల మధ్య గొడవ...
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్
మేడ్చల్ లో మరో దారుణ హత్య
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు
హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు