హైదరాబాద్‌లో ఇద్దరు నకిలీ జర్నలిస్ట్‌ల అరెస్ట్
హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు నకిలీ జర్నలిస్ట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిర్రా కోటేష్, వడ్లకొండ నరేష్ అనే వ్యక్తులు RE5 న్యూస్ అనే యూట్యూబ్ చానెల్ రిపోర్టర్స్‌మని చెప్పుకుంటూ అనేక దందాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో.. సరూర్‌నగర్‌లోని శ్రీ బాలాజీ మిఠాయి బండార్ అనే షాప్‌లో.. వీళ్లిద్దరూ కలిసి స్వీట్స్ కొన్నారు. తర్వాత వారి పథకం ప్రకారం.. ఆ స్వీట్స్‌లో ఎండు రొయ్యని పెట్టి డ్రామా షురూ చేశారు. ఈ స్వీట్స్ వల్లే తమకు వాంతులు అయ్యాయని.. తాము రిపోర్టర్స్‌మని చెప్పి.. డబ్బులు డిమాండ్ చేశారు. ఐతే.. వీళ్లపై అనుమానం కలిగిన సదరు షాప్ యజమాని పోలీసులకు ఫోన్ చేయడంతో.. ఇద్దరు పారిపోయారు. ఈ ఘటనపై సరూర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నకిలీ జర్నలిస్ట్స్ని అరెస్ట్ చేశారు. గతంలో వీళ్లు ఇలాంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.