గుండ్లపోచంపల్లిలో ఫ్యాన్స్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

By Ravi
On

IMG-20250429-WA0027మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసరగాడి కేకేసి ఎలక్ట్రికల్ అనే ఫాన్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి స్పాట్ కి వచ్చిన పోలీసులు దాదాపు ఐదు గంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు.  ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. షాట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News