హైదరాబాద్ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్..!
By Ravi
On
హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇల్లు అద్దెకు కావాలంటూ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె మెడలోని ఏడు తులాల బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. టూలెట్ బోర్డు చూసి ఇంట్లోకి వచ్చిన నిందితుడు.. వృద్ధురాలి మెడలోని అభరణాలను దోచుకున్నాడు. సదరు వృద్ధురాలు అరుస్తూ బయటికి వచ్చేలోపు పరారైనట్లు తెలుస్తోంది.
బాధితురాలు వెంటనే మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Related Posts
Latest News
19 Apr 2025 22:02:54
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...