స్టూడెంట్ ని దొంగగా మార్చిన ట్యూషన్ టీచర్.. జీడిమెట్ల పిఎస్ లో కేసు నమోదు
By Ravi
On
చదువు కోసం వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు దొంగగా మార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షాపూర్ నగర్ లో ఉండే ఓ బాలుడు ఇంటి దగ్గరే ఉన్న ట్యూషన్ కి వెళ్లి వస్తూ ఉండేవాదు. చదువు చెప్పాల్సిన టీచర్ డబ్బులు కావాలంటూ ఇంట్లో నుండి దొంగతనం చేయాలంటూ చెప్పింది. అలా స్టూడెంట్ ని తనవైపు తిప్పుకుని రెండు లక్షలు కాజేసింది. చివరకు తన తండ్రి ఐ ఫోన్ కొట్టేసిన బాలుడు దాన్ని విక్రయిస్తుండగా మొబైల్ షాప్ యజమానికి అనుమానం వచ్చి బాలుడి తండ్రికి సమాచారం ఇచ్చాడు. దీనితో అసలు విషయం బయట పడి బాలుడి తండ్రి కమల్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
29 Apr 2025 22:30:48
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల...