యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం

By Ravi
On
యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం

IMG-20250428-WA0082నల్గొండ జిల్లా దామరచర్ల (మం) వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్-1బాయిలర్ లో ఆయిల్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
తెల్లవారుజామున 3:00కు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో  అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే నెలలో యూనిట్ - 1 ను  ప్రారంభించేందుకు ట్రైలర్ రన్ చేస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో గాను 5 యూనిట్లకు ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 ల మెగావాట్లు.  స్టేజ్ I లో రెండు యూనిట్లు, స్టేజ్ ll లో 3 యూనిట్లు ఉంటాయి. ప్రస్తుతం స్టేజ్ వన్ లో 2 వ యూనిట్ ను 12.9.2024 న ప్రారంభించారు. దీనిని స్టేట్ గ్రిడ్ కి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం మొదటి యూనిట్ పనులు పూర్తి అయ్యాయి ప్రారంభానికి సిద్ధంగా ఉందగా ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 1000 మీటర్లు ఉన్న బాయిలర్ 30 మీటర్ల మేర పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్తి నష్టం పై అధికారులు అంచనా వేస్తున్నారు. పవర్ ప్లాంట్ ప్రమాదంపై తక్షణమే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడి ప్లాంట్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీశారు.యూనిట్ వన్ లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన మూడు బాయిలర్లు రన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. త్వరితగతన ప్రమాదానికి గురైన బాయిలర్ గ్యాస్ కట్ ను రిపేరు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించగా 24 గంటల్లోపు రన్నింగ్ లోకి తీసుకువస్తామని అధికారులు హామీ ఇచ్చారు. జరిగింది చిన్న ప్రమాదం ఆందోళన చెందవద్దని  ఎమ్మెల్యే తెలిపారు.

Tags:

Advertisement

Latest News

అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి  సమావేశం నిర్వహించారు....
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్
భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ