అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య

By Ravi
On
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షెడ్యూల్ కులాలపై దాడులు, వివక్షలకు సంబంధించిన కేసుల పరిణామాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి, వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి న్యాయం అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం (అట్రాసిటీస్ యాక్ట్) కింద నమోదైన ప్రతి కేసు పట్ల కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. IMG-20250428-WA0170దీనికి  స్పందించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, తమ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేయడం ద్వారా అధిక శిక్షలు పడేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. న్యాయ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.

Tags:

Advertisement

Latest News

కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లా  పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు...
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా