26.7 కేజీల గంజాయి పట్టివేత..!
హైదరాబాద్ TPN
హైదరాబాద్ ధూల్‌పేట్‌లో అక్రమంగా దిగుమతి చేసుకున్న 25.2 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ఏ టీమ్ పట్టుకున్నారు. ఇదే టీమ్ మరో 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసి.. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. మొత్తంగా పట్టుకున్న 26.7 గంజాయి విలువ రూ. 13.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ధూల్‌పేటలో రాణి అవంతిబాయి విగ్రహం సమీపంలో.. ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని తీసుకువెళుతున్న అకాష్‌సింగ్‌ను ఎస్టీఎఫ్‌ఏ టీమ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న లఖన్‌సింగ్, సంజయ్‌సింగ్, జ్యోతి బాయ్, అనంద్‌సింగ్, మణిష్ సింగ్, దీప, నిరంజన్ కుమార్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్‌ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు. ఇక జియాగూడ పీలా కాశీ శివమందిర్ సమీపంలో గంజాయిని అమ్మకాలు జరుపుతున్న భద్రినారాయణ్ సింగ్‌ను ఎస్టీఎఫ్‌ఏ టీమ్ అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బంగ్లా వాలా అజయ్‌సింగ్, మంజు దేవిలకు సంబంధం ఉండడంతో వారిపై కూడ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.