శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
By Ravi
On
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదు దారుడు, అతని కార్యకర్తను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్ఐ పరశురామ్ నాయక్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఫిర్యాదు దారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అప్పటికే 2 లక్షల రూపాయలు లంచం ఇవగ, సోమవారం మరో 22 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఎస్ఐ పరశురామ్ పై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయ మూర్తి ఎదుట హాజరు పరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్స్ అప్ నంబర్ 9440446106 సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
Tags:
Latest News
28 Apr 2025 20:03:47
గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్రాష్ట్రంలోని పహేల్గామ్ లో పర్యాటకులైన 28 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరులను నిందిస్తూ, భారత్ మాతాకీ జై...