భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఐపిఎస్ లకు షాక్ తగిలింది. భూదాన్ భూముల అక్రమాల్లో 28 మంది సీనియర్ అధికారులపై ఆరోపణల నేపధ్యంలో రంగంలోకి ఈడి దిగింది. నోటీసులు అందించి విచారణ జరిపేందుకు సిద్దమైంది. మహేశ్వరం మండలం నాగారం లో సర్వే నెం 182,194,195 లో భూదాన్ భూములను అక్రమం గా లే అవుట్ చేసి అమ్మిన మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫానా, సుఖుర్ ఇళ్లపై ఇప్పటికే ఈడి సోదాలు జరిపారు. ఈ భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎస్ లు, మాజీ డీజీపిలు, సీనియర్ ఐఏఎస్ లు, సీనియర్ పోలీసు అధికారుల పాత్రపై హైకోర్టు మండిపడిపడింది. ఉన్నతాధికారుల పాత్రపై విచారణ జరిపించాలని హై కోర్టులో పిటీషన్ దాఖలు కాగా రెవెన్యూ అధికారులసాయంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్ల మీద భూములు బదలాయింపు చేశారని ఆరోపణలు ఎదురైనాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడి, సిబిఐ లకు హై కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనితో రంగంలోకి దిగిన ఈడి నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు సిద్దమైంది. వీరిలో ...
ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు నవీన్ మిట్టల్, జ్ఞానముద్ర (సోమేశ్‌కుమార్ భార్య), పావనీరావు (రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు భార్య), ఐశ్వర్యరాజు (ఈ వికాస్‌రాజు భార్య), వసుంధర సిన్హా, ఏకే మొహంతి, ఓం అనిరుధ్ (ఐపీఎస్ అధికారి రాచకొండ కమిషనర్ కొడుకు), నందిన్‌మాన్ (ఐపీఎస్ విక్రమ్‌సింగ్‌మాన్ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్ సందీన్‌సుల్తానియా భార్య), రాధిక (ఐపీఎస్ కమలాసన్‌రెడ్డి భార్య), నితేశ్‌రెడ్డి (మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కొడుకు), ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్‌జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, రేఖా షరాఫ్ (ఐపీఎస్ ఉమేశ్‌షరాఫ్ భార్య), రేణుగోయల్ (డీజీపీ జితేందర్ భార్య), దివ్యశ్రీ (ఐఏఎస్ ఆంజనేయులు భార్య), హేమలత (ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి భార్య), ఇందూరావు కే (ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్య), సవ్యసాచి ప్రతాప్‌సింగ్ (ఐపీఎస్ గోవింద్‌సింగ్ కొడుకు), రాహుల్ (రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి కొడుకు), వరుణ్ (ఐపీఎస్ విశ్వప్రసాద్ కొడుకు), రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ, ఐఏఎస్‌లు అమోయ్‌కుమార్, రాజశ్రీ హర్ష, అజయ్‌జైన్, ఇతర అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.