ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!
By Ravi
On
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్ కెమెరాలతో చిరుత సంచారాన్ని రికార్డ్ చేసే క్రమంలో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఒక చిరుత మాత్రం చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మరో చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిక్కిన చిరుతను హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. ఇక్రిశాట్ సిబ్బంది, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచుతున్నారు. గతంలోనూ ఇక్కడ ఒక చిరుతను అధికారులు బంధించారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...