హయత్ నగర్ లో రెచ్చిపోయిన దొంగలు.. ఇద్దరిపై కత్తులతో దాడి..30 గొర్రెలు చోరీ
By Ravi
On
హయత్ నగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివారు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను దొంగిలించి పారిపోయారు. గొర్రెలను దొంగిలిస్తున్న సమయంలో అడ్డుకున్న యువకులకు దోపిడీ దొంగలకు మధ్య గొడవ చెలరేగింది. ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి ఆరోగ్యం బాగలేక పోయే సరికి గొర్రెల మంద వద్ద తన బంధువుతో కలిసి కావలిగా ఉన్నాడు. అదే సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ నవీన్ తండ్రి ఒంటరిగా ఉండటం గమనించిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Tags:
Latest News
28 Apr 2025 17:26:43
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదు దారుడు, అతని కార్యకర్తను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్ఐ...