హయత్ నగర్ లో రెచ్చిపోయిన దొంగలు.. ఇద్దరిపై కత్తులతో దాడి..30 గొర్రెలు చోరీ

By Ravi
On
హయత్ నగర్ లో రెచ్చిపోయిన దొంగలు.. ఇద్దరిపై కత్తులతో దాడి..30 గొర్రెలు చోరీ

హయత్ నగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివారు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను దొంగిలించి పారిపోయారు. గొర్రెలను దొంగిలిస్తున్న సమయంలో అడ్డుకున్న యువకులకు దోపిడీ దొంగలకు మధ్య గొడవ చెలరేగింది. ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి ఆరోగ్యం బాగలేక పోయే సరికి గొర్రెల మంద వద్ద తన బంధువుతో కలిసి కావలిగా ఉన్నాడు. అదే సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ నవీన్ తండ్రి ఒంటరిగా ఉండటం గమనించిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.IMG-20250428-WA0012

Tags:

Advertisement

Latest News

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్రాష్ట్రంలోని పహేల్గామ్ లో పర్యాటకులైన 28 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరులను నిందిస్తూ, భారత్ మాతాకీ జై...
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి