ప్లే ఆఫ్స్‌ కు ఎవరు వెళతారంటే?

By Ravi
On
ప్లే ఆఫ్స్‌ కు ఎవరు వెళతారంటే?

ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన ఈ టైమ్ లో, ప్లే ఆఫ్స్ రేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. టీమ్స్ తమ అవకాశాలను నిలబెట్టుకోవడానికి అవసరమైన విజయాల కోసం పోరాడుతున్నాయి. 16 పాయింట్ల కట్‌ ఆఫ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రతి జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు ఇంకా ఎంత దూరం వెళ్లాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మిగిలిన 4 మ్యాచ్‌లలో కనీసం 1 విజయం సాధిస్తే 16 పాయింట్లకు చేరుకుంటారు, ప్లే ఆఫ్స్ ఆశలు బలంగా ఉంటాయి. గుజరాత్ టైటాన్స్.. మిగిలిన 6 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. నెక్ట్స్ ముంబై ఇండియన్స్ టీమ్.. మిగిలిన 4 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే 16 పాయింట్ల మార్క్‌ను చేరుకుంటారు. 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్.. మిగిలిన 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటారు. మరోపక్క పంజాబ్ కింగ్స్ మిగిలిన 5 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధిస్తే అర్హత సాధించే అవకాశం ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మిగిలిన 4 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధిస్తే 16 పాయింట్లకు చేరుకుంటారు. కోల్ కతా నైట్ రైడర్స్.. మిగిలిన 5 మ్యాచ్‌లలో అన్ని 5 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ అవకాశాలు పోతాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్.. మిగిలిన 5 మ్యాచ్‌లలో అన్ని 5 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ ఆశలు ముగుస్తాయి. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లకు చేరుకునే అవకాశం లేదు. దీంతో ఈ టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో లేనట్టే. అండ్ ఫైనల్లీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం లేదు దీంతో ఈ టీమ్ కి కూడా ప్లే ఆఫ్స్ రేసులో అవకాశం లేనట్టే.

Tags:

Advertisement

Latest News

అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి  సమావేశం నిర్వహించారు....
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్
భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ