బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ అప్డేట్స్ తో సంయుక్త మీనన్..

By Ravi
On
బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ అప్డేట్స్ తో సంయుక్త మీనన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్‌ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి  మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత మరోసారి డెవిల్‌ కోసం కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది. బట్  బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. 2023 లో వచ్చిన డెవిల్ తర్వాత కనిపించకుండా పోయింది సంయుక్త. గతేడాది సంయుక్త నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఇప్పుడు సంయుక్త భారీగా ప్లాన్ చేస్తుంది.

వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది.  ప్రజెంట్ సంయుక్త చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో మూడు మైథాలజీతో లింక్ ఉండేవి కావడం గమనార్హం. నిఖిల్ సిద్దార్థ్‌‌తో చేస్తోన్న స్వయంభు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైంధవ, బాలకృష్ణ అఖండ 2 తాండవం మైథాలజీ డ్రామాకు చెందిన సినిమాలుగా తెలుస్తోంది. ఇవే కాకుండా శర్వానంద్ కు జోడీగా నారీ నారీ నడుమ మురారీతో పాటు హిందీలో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ అనే మూవీ చేస్తోంది. ఇక శర్వానంద్ మూవీ ఈ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమాలన్నీ సంయుక్తని టాప్ పొజిషన్ లో నిలబెట్టాలని కోరుకుందాం.

Tags:

Advertisement

Latest News

అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి  సమావేశం నిర్వహించారు....
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్
భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ