ఏపీ లిక్కర్‌స్కామ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్..!
By Ravi
On
ఏపీలో లిక్కర్‌స్కామ్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌లో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. లిక్కర్‌స్కామ్‌లో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనని.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు.. ఇంకా దొరకని దొంగలు తన పేరును అనవసరంగా ఈ స్కామ్‌లోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క రూపాయి కూడా తాను ముట్టలేదని స్పష్టం చేశారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని.. మిగతా సగం బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఈ కేసులో కీలకపాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో.. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News
08 May 2025 10:51:12
చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కేశవగిరి ప్రాంతంలో ఓ ఇంట్లో నుండి మంటలు వస్తున్నాయంటూ స్థానికులు డయల్ 100కి సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న...