30 ఏళ్లుగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాం: పాక్ రక్షణ మంత్రి

By Ravi
On
30 ఏళ్లుగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాం: పాక్ రక్షణ మంత్రి

పహల్గామ్‌ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో  ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని ఒప్పుకున్నారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు. భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం గురించి మాట్లాడిన ఖవాజా ఆసిఫ్ పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా అంతమైందని అన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు. 

అంతేకాకుండా లష్కరే నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద సంస్థ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది కదా? అని యాంకర్ ఖ్వాజా ఆసిఫ్‌ను ఆడిగారు. మాతృ సంస్థ లేనప్పుడు ఆఫ్‌షూట్ సంస్థ ఎక్కడి నుంచి వస్తుంది అని సమాధానమిచ్చారు. ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని మీరు నమ్ముతున్నారా? అని యాంకర్ క్వశ్చన్ వేశారు. ఈ ప్రశ్నకు ఆసిఫ్ సమాధానమిస్తూ ..పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అంగీకరించారు. ఇది తమ తప్పు అని.. దీనివల్ల తమకు నష్టం వాటిల్లిందని ఖ్వాజా ఆసిఫ్ పేర్కోన్నారు.

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...