పహల్గాం పర్యాటకాన్ని అతలాకుతలం చేసిన ఉగ్రదాడి..

By Ravi
On
పహల్గాం పర్యాటకాన్ని అతలాకుతలం చేసిన ఉగ్రదాడి..

జమ్ముకశ్మీర్‌ లో తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడి అక్కడి పర్యాటక పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా బతుకుతున్న స్థానికులు తమ జీనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పర్యాటకులు రాక చిరు వ్యాపారులు, ఉపాధి లేక దుకాణాలు, హోటళ్లలో పనిచేసే చిరుద్యోగులు తాము బతికేదెలా అని ఆందోళన చెందుతున్నారు. పహల్గాంలో పర్యాటక పరిశ్రమే స్థానికులకు జీవనాధారం. అక్కడి స్థానికుల్లో వివిధ దుకాణాల ద్వారా పర్యాటకులకు అవసరమైన వస్తువులను విక్రయిస్తూ కొందరు, హోటల్‌లు, రెస్టారెంట్‌ల ద్వారా పర్యాటకులకు భోజనం, బస సౌకర్యాలు కల్పిస్తూ మరి కొందరు జీవిస్తున్నారు. వారి దగ్గర వివిధ పనులు చేస్తూ పలువురు కూలీలు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 

ఈ క్రమంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడితో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పర్యాటకులంతా పహల్గాం నుంచి తిరిగి వెళ్లిపోయారు. పలువురు స్థానికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. దాంతో అక్కడి దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. దాంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము బతికేదెలా అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి తమకు గతంలో ఎన్నడూ ఎదురుకాలేదని అవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గత మంగళవారం మధ్యాహ్నం ఐదుగురు ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా దారుణం చేశారు. విహారయాత్రకు వచ్చిన మహిళలు, పిల్లలను విడిచిపెట్టి పురుషులను కాల్చిచంపారు.

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...