వ్యక్తిపై బండరాయితో దాడి..!

By Ravi
On
వ్యక్తిపై బండరాయితో దాడి..!

రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లాలగూడలో ఓ వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో దాడి చేశారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడిలో గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని.. దాడి చేసిన వ్యక్తులను సీసీ కెమెరాల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు.
Tags:

Advertisement

Latest News