మహనీయుల ఆశయాలే మార్గదర్శనంగా మారాలి : సబితా ఇంద్రారెడ్డి 

By Ravi
On
మహనీయుల ఆశయాలే మార్గదర్శనంగా మారాలి : సబితా ఇంద్రారెడ్డి 

బాబూ జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాలు, వారి మార్గదర్శకత్వం నేటి సమాజానికి మార్గదర్శనంమని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. సమాజంలో అన్యాయానికి, అసమానతలకు ఎదురుగా నిలబడి, సామాజిక న్యాయసాధనకు జీవితాంతం పోరాడిన బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఆయన ఆశయాలకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరికి సమాన హక్కులు, అవకాశాలు కలిగే సమాజం నెలకొల్పడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.
Tags:

Advertisement

Latest News