పాతబస్తీలోని గడి మసీదు నందు జిల్లా ఎస్పీ సందర్శన

By Ravi
On

రానున్న రంజాన్ పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలి: శ్రీ. శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

రంజాన్ పండగ సందర్భంగా, ముస్లిం ప్రజలందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముస్లిం మత పెద్దలతో, యువకులతో మాట మాంతి

ఈరోజు నల్గొండ పట్టణంలోని పాతబస్తీలో ఉన్న గడి మసీదును గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు ముస్లిం మత పెద్దలతో, ప్రార్థన కొరకు వచ్చిన వారితో కొద్దిసేపు మాట్లాడారు. 
రానున్న పండగలను ఉగాది  మరియు రంజాన్ ను జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి మతసామరస్యం పాటిస్తూ శాంతియుతంగా జరుపుకోవాలని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా నల్గొండ జిల్లా శాంతి సామరస్యాలకు మారుపేరని ఎలాంటి గొడవలకు, అవాంఛనీయ సంఘటనలకు, అసత్య ప్రచారాలకు తావు ఇవ్వడంలేదని గుర్తు చేస్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది. 
ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ప్రకటనలు, వార్తలు, వీడియోలు, మెసేజ్లు గుడ్డిగా నమ్మవద్దని లేనిచో సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

అలాగే రానున్న ఐపీఎల్ లో ముఖ్యంగా యువత బెట్టింగ్లకు పాల్పడుతున్నారని, దాని మూలంగా వారి జీవితాలలో, వారి కుటుంబ జీవితాలలో ఆర్థికంగా చితికిపోయి విషాదానికి గురి అవుతున్నారని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులలో బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లరాదని, ఒకవేళ అలాంటి సమాచారం ఉన్నట్లయితే పోలీస్ 100 నెంబర్ కు గాని, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్ కి గాని తెలియజేయాలని సూచించారు. 
అలాగే నల్గొండ పట్టణంలో ముఖ్య చౌరస్తాలు బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!