అక్రమ ఔషధాలు సీజ్‌..!

By Ravi
On
అక్రమ ఔషధాలు సీజ్‌..!

అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు. కటకం అభిలాష్ అనే వ్యక్తి డ్రగ్‌ లైసెన్స్ లేకుండానే మెడిసిన్స్‌ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మొత్తం 31 రకాల లైసెన్స్ లేని ఔషధాల్ని సీజ్‌ చేశారు. వీటిలో మానవ, పశు యాంటీబయాటిక్స్ గల ఇన్స్‌స్టిట్యూషనల్ సప్లై డ్రగ్స్ ఉన్నాయి. వీటి విలువ రూ. 25,000 ఉంటుందని అధికారులు తెలిపారు.  డీసీఏ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పావని ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. డీసీఏ అధికారులు అనాలిసిస్ కోసం నమూనాలు సేకరించారు. మరింత దర్యాప్తు అనంతరం నిజ్ధనల ప్రకారం నేరస్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా ఔషధాలను నిల్వ చేసి అమ్ముతున్న వ్యక్తులకు మందులు సరఫరా చేసే హోల్‌ సేలర్స్‌ మరియు డీలర్లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం శిక్షార్హులేనని చెప్పారు. ఇలాంటి సరఫరాదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఔషధాలను సరఫరా చేసేముందు డ్రగ్ లైసెన్స్ ఉందా..? లేదా..? అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవలన్నారు.
Tags:

Advertisement

Latest News