ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చిన చంద్రబాబు..!

By Ravi
On
ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చిన చంద్రబాబు..!


తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. నందిగామ నియోజకవర్గం పర్యటనలో కొలికపూడిని చంద్రబాబు పట్టించుకోలేదు. హెలికాప్టర్‌ దిగిన అనంతరం తనకు స్వాగతం పలకడానికి వచ్చిన ముఖ్యనేతలతో మాట్లాడారు. అదే సమయంలో కొలికపూడి వైపు చంద్రబాబు సీరియస్‌గా చూశారు. పార్టీ నేతలందరికీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి పక్కనే ఉన్న కొలికపూడిని మాత్రం పట్టించుకోలేదు. దీంతో కొలికపూడి వెనక్కి వెళ్లి నిలబడ్డారు. వరుస వివాదాలతో కొలికపూడి ఈ మధ్య వార్తల్లొకెక్కారు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. కొలికపూడిని చంద్రబాబు పట్టించుకోకపోవడానికి ఇదే కారణమని పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags:

Advertisement

Latest News