మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కార్యక్రమం

By Ravi
On
మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కార్యక్రమం

 

మక్తాల ఫౌండేషన్, గ్రీనరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సికింద్రాబాద్ సోమసుందరం స్ట్రీట్, జనరల్ బజార్ అంజలి థియేటర్ ప్రాంతాల్లో ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగింది.

మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మక్తల జలంధర్ గౌడ్ మాట్లాడుతూ, "పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత" అని తెలిపారు. ఆయన కేవలం కార్యక్రమంలో పాల్గొన్న వారికే కాకుండా ప్రతి ఒక్కరినీ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం, ఆయన అందరితో కలిసి “నేను భూమిని జాగ్రత్తగా చూసుకుంటానని, చెత్త వేయకుండా, జంతువులను జాగ్రత్తగా చూసుకుంటానని, ఆరోగ్యవంతమైన జీవితం కోసం మొక్కలు పెంచుతానని” అనే ప్రతిజ్ఞ చేయించారు.

మక్తల జలంధర్ గౌడ్ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ పరిస్థితి దెబ్బతినిపోతున్నాయని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి ఇంట్లో, కార్యాలయంలో, షాపుల్లో రెండు మొక్కలు పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డి. ప్రకాష్, జె. భాస్కర్, కె. వెంకటేష్, యం. వెంకట చారి, బి. ఆంజనేయులు, సి.యస్. రాజేష్, పోషేట్టి, కిరణ్, శ్రీనివాస్, నరేష్, శ్రీధర్, యస్. రాంచందర్, క్రితిక్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
హైదరాబాద్, ఏప్రిల్ 10: అక్షర చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి తీవ్ర అసంతృప్తితో బాధితులు బుధవారం ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. అధిక...
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..
తప్పిన పెను ప్రమాదం..
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..
టారీఫ్ లకు వ్యతిరేకంగా చైనా విదేశాంగ శాఖ!
ట్రంప్ టారీఫ్ లపై 90 రోజుల బ్రేక్‌.. కారణం ఏంటంటే?