కోటనందూరు పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతా - డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు
NV SURYA TUNI TPN
కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా వెలగా వెంకటకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కృష్ణారావు స్పందిస్తూ పార్టీకి తాను చేసిన సేవలకు గాను లభించిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య తనకు పదవి కేటాయించడం పట్ల మీడియాతో ఆనందాన్ని పంచుకున్నారు తెలుగుదేశం పార్టీలో తనకు శాశ్వత సభ్యత్వం ఉన్నట్లు వివరించారు భవిష్యత్ తరాలకు సేవలందించాలన్న దృఢ సంకల్పంతో పార్టీ యువతను ప్రోత్సహించడం ఆనందదాయకమని తెలిపారు తనకు కేటాయించిన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు యనమల రామకృష్ణుడు, దివ్యల సహకారంతో పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు పార్టీ విధి విధానాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని ఆనందం వ్యక్తం చేశారు.