ఎంఎస్‌ ధోనీకి మరో అరుదైన రికార్డు..

By Ravi
On
ఎంఎస్‌ ధోనీకి మరో అరుదైన రికార్డు..

స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్‌ ధోనీ తన అకౌంట్ లో మరో అరుదైన రికార్డ్ ను యాడ్ చేసుకున్నారు. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న ధోనికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రజంట్ ఐపీఎల్ లీగ్ లో చెన్నై టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. ఈ విజయంలో ధోనీ కీ రోల్ ను ప్లే చేశారు. కేవలం 11 బంతుల్లో 26 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ గా నిలిచారు. 43 సంవత్సరాల 282 రోజుల వయసులో ఈ అవార్డు అందుకున్న క్రికెటర్‌గా ధోనీ నిలిచారు. 

అయితే అతి ఎక్కువ వయసులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశారు. 2014లో ప్రవీణ్‌ తంబే 42 సంవత్సరాల 209 రోజుల వయసులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు తంబే రికార్డును ధోనీ బ్రేక్‌ చేశారు. మరోవైపు, 2011లో షేన్ వార్న్ రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్నాడు. 41 సంవత్సరాల 223 రోజుల వయసులో, 41 సంవత్సరాల 211 రోజుల వయసులో వార్న్ అవార్డు అందుకున్నాడు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..