వివాహితులిద్దరి మధ్య శారీరిక సంబంధం నేరం కాదు: హైకోర్టు
ప్రస్తుతం సమాజంలోని తీరుపై ఒక్కోక్కరూ ఒక్కోలా స్పందిస్తూ ఉంటారు. కానీ అన్నింటి కన్నా న్యాయస్థానం స్పందించే విధానం చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో న్యాయస్థానం సైతం తమ దృష్టికి వచ్చే ఆయా కేసుల విషయమై కొన్ని సార్లు భిన్నంగా స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నారు. ఈ క్రమంలోనే కలకత్తా హైకోర్టు ఓ సంచలన తీర్పును తెలియజేసింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వివాహితులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇరువురికి వైవాహిక స్థితి గురించి తెలిశాక.. సమ్మతితో సెక్స్ సంబంధం పెట్టుకోవడం ఏ మాత్రం నేరం కాదని పేర్కొంది. ఏకాభిప్రాయంగా పరిగణించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కాగా ఈ కేసులో ఇద్దరు వివాహితులు రెండేళ్ల నుంచి శారీరిక సంబంధం కలిగి ఉన్నారు. విషయం తెలుసుకున్న మహిళ భర్త.. ఆమెతో జీవించడానికి నిరాకరించి కేస్ ఫైల్ చేశారు. దీంతో తనతో సంబంధం ఉన్న మహిళను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆమె సెప్టెంబర్ 8, 2024న మేనాగురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 69 మరియు 351(2) కింద కేసును నమోదు చేశారు. ఇక విచారణ సందర్భంగా ఆ వ్యక్తిపై కేసు విచారణను రద్దు చేశారు.