సచివాలయంలో అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

By Ravi
On
సచివాలయంలో అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 4 :  వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని  అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిందీ లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం, 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని అన్నారు.

WhatsApp Image 2025-04-04 at 5.22.35 PM

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..