చెన్నై టీమ్ లోకి వచ్చిన 17 ఏళ్ల అయూష్ ఎవరంటే?

By Ravi
On
చెన్నై టీమ్ లోకి వచ్చిన 17 ఏళ్ల అయూష్ ఎవరంటే?

చెన్నై టీమ్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. పైగా కీ ప్లేయర్ కూడా. రీసెంట్ గా రుతురాజ్ కు గాయం కావడంతో ఈసారి ఐపీఎల్ నుండి తప్పుకున్నారు. దీంతో కెప్టెన్ గా ధోనీ బాధ్యతలు తీసుకున్నారు. అలాగే రుతురాజ్ కు ప్రత్యామ్నాయంగా సీనియర్ బ్యాటర్ టీమ్ లోకి వస్తారని అనుకున్నారు. కానీ 17 ఏళ్ల అయూష్ మాత్రే చెన్నై టీమ్ లోకి రావడంతో అంతా సర్ ప్రైజ్ అయ్యారు. అయితే అతనిలో ఖచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉందనే విషయాన్ని గుర్తించారు. 2024 సీజన్ లో విజయ్ హజరే ట్రోఫీలో తను ముంబై తరఫున గేమ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఓపెనర్ కర్ణాటకపై ఫస్ట్ మ్యాచ్ లోనే 78 పరుగులతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. 

తర్వాత నాగాలండ్ పై, సౌరాష్ట్రపై అత్యధిక పరుగులు చేశాడు. కాగా ఈ ఏడాది జనవరిలో మేఘాలయపై అయూష్‌ ఫస్ట్ రంజీ మ్యాచ్‌ ఆడాడు. రుతురాజ్‌ కు గాయం కావడంతో చెన్నై.. అయూష్‌కు ఛాన్స్ ఇచ్చింది. రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. మరోపక్క గాయపడిన లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రవిచంద్రన్‌ సమరన్‌ ను టీమ్ లోకి తీసుకుంది. కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల రవిచంద్రన్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌. అతడిని రూ.30 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్‌ సొంతం చేసుకుంది.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..