హీరో సైఫ్ అలీఖాన్ కేసులో ఊహించని ట్విస్ట్..
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన కత్తిపోటు ఘటన కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు, నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహాజాద్ తో మ్యాచ్ అవ్వట్లేదని పోలీసులు నిర్ధారించారు. కాగా న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఈ మేరకు పేర్కోన్నారు. రీసెంట్ గా పోలీసులు 1600 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సైఫ్ అలీఖాన్ ఇంటికి చేరుకుని సకాలంలోనే వేలిముద్రలు సేకరించారు. అంతేకాకుండా సీసీ కెమెరాను సైతం పరిశీలించారు.
అంతేకాకుండా ఫ్లాట్ లోని 20 వేలి ముద్రల నమూనాలను కూడా కనుగొన్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దీంతో అనుమానితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరి ఇప్పుడు అతని వేలిముద్రలు మ్యాచ్ అవ్వట్లేదనే విషయం మరింత కఠినతరం అయ్యేలా చేస్తుంది. కాగా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న కత్తిపై ఉన్న వేలిముద్రలు మ్యాచ్ అవుతున్నాయని పోలీసులు సూచించారు.