ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్..
ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశం అణ్వాయుధాల ప్రస్తావన మర్చిపోవాలని, లేకపోతే అణు స్థావరాలపై మిలటరీ చర్య ఉంటుందన్నారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినా ఇరాన్ కావాలని ఈ వ్యవహారం చేస్తుందన్నారు. ఇరాన్ కావాలనే ఈ విషయంలో మోసం చేస్తుందని ట్రంప్ కామెంట్ చేశారు. అంతేకాకుండా అణు ఒప్పందంపై ఒమన్ లో ఇరాన్, అమెరికాకు మధ్య చర్చలు సైతం జరిగాయి. అయితే ఈ చర్చల తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికాను తన వైపుకు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారని అన్నారు.
అందుకే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని, ఆ ఆలోచనను సైతం వారు విరమించుకోవాలని అన్నారు. ఇరాన్ కావాలని అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే టెహ్రాన్ అణు కేంద్రాలపై సైనిక దాడి జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. కానీ చర్చలు పురోగతి సాధించలేదు. ఒబామా కాలంలో మాత్రం చర్చలు ఫలించాయి. 2015లో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. అనంతరం ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.