ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గ్రహీత శ్రేయస్ అయ్యర్..

By Ravi
On
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గ్రహీత శ్రేయస్ అయ్యర్..

మార్చి 2025 కు గానూ ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇండియన్ బ్యాట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్‌ కు చెందిన జాక‌బ్ డ‌ఫీ, ర‌చిన్ ర‌వీంద్ర నుంచి ఈ అవార్డ్ కు పోటీ వ‌చ్చినా.. ఆ రేసులో అయ్య‌ర్ టాప్‌ లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీలో ఇండియ‌న్ బ్యాట‌ర్ అత్య‌ధికంగా 243 ర‌న్స్ స్కోర్ చేశాడు. భార‌త జ‌ట్టు గెలుపుతో అత‌ను కీ రోల్ ను ప్లే చేశారు. అయితే వ‌రుస‌గా ఇద్ద‌రు ఇండియ‌న్స్ కి ఈ అవార్డు ద‌క్కింది. ఫిబ్ర‌వ‌రి నెల‌లో శుభ‌మ‌న్ గిల్ .. ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 

నెక్ట్స్ మిడ‌ల్ ఆర్డ‌ర్‌లో అయ్య‌ర్ ఇటీవ‌ల కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. అద్భుత‌మైన స్ట్రోక్ ప్లేను ప్రజంట్ చేశారు. కీల‌క భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పాడు. జ‌ట్టు ట్రోఫీ గెల‌వ‌డంతో కీల‌కంగా వ్య‌వ‌హించారు. మార్చి నెల‌కు ఐసీసీ అవార్డు ద‌క్క‌డం సంతోషంగా ఉంద‌ని అయ్య‌ర్ తెలిపాడు. ఈ గౌర‌వం త‌న‌కు ఎంతో స్పెషల్ అని అన్నారు. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన నెల‌లోనే ఆ అవార్డు రావ‌డంతో నిజంగా ఆ జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేమ‌న్నారు. మార్చిలో ఆడిన మూడు వ‌న్డేల్లో అత‌ను 57 స‌గ‌టుతో 172 ర‌న్స్ చేశాడు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..