ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..

ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ రాక తర్వాత గడ్డు కాలం నడుస్తుంది. ఇప్పటికే ఆయన నిర్ధేశించిన టారీఫ్ లతో సతమతమవుతున్నాయి ప్రపంచ దేశాలు. అయితే ఆయన స్వదేశంలోనూ ట్రంప్ షాకులు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాకిచ్చింది. యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని వైట్‌హౌస్ ఆరోపణలు చేసింది. జో బైడెన్ పదవీకాలంలో అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి.
ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. హార్వర్డ్‌తో పాటు పలు యూనివర్సిటీలు ఉన్నట్లు సమాచారం. ఇక ట్రంప్ నిర్ణయాలను హార్వర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఇక హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్, విద్యార్థులు, అధ్యాపకులు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. మరి ఈ విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
Latest News
