న్నవరం రైతులకు 227 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
గన్నవరం:
గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన 99 మంది రైతులకు విజయవాడలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో 227 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 147 నివాస ప్లాట్లు మరియు 80 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి.
ఈ-లాటరీ ప్రక్రియలో రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ముందుగా ట్రైల్ రన్ వేసి, అనంతరం ప్రత్యక్ష లాటరీ నిర్వహించారు. లాటరీ ప్రక్రియలో విజేతలు తమ ప్లాట్లను సొంతంగా పొందారు.
రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు గుడివాడ రెవిన్యూ డివిజన్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, సిఆర్డిఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ల్యాండ్ అక్వైజేషన్) NSVB వసంతరాయడు, ల్యాండ్స్ విభాగం అధికారి తెలిపారు.
ప్లాట్ల భౌగోళిక కేటాయింపుని వివరించేందుకు ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది మరియు గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రైతులకు సూచించారు.