భారతదేశంలో ఏపీని క్రీడలు పరంగా నెంబర్ వన్ గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

By Ravi
On
భారతదేశంలో ఏపీని క్రీడలు పరంగా నెంబర్ వన్ గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

WhatsApp Image 2025-03-23 at 4.26.51 PM

శ్రీకాకుళం పట్టణంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఏపీ సాఫ్ట్ బాల్ ప్రెసిడెంట్ మరియు ఆమదాలవలస గౌరవ శాసన సభ్యులు, పియుసి చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ గారు అధ్యక్షత వహించారు.

మిగతా బాడీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, సెక్రెటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో, రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, క్రీడాకారులకు అన్ని వసతులు మరియు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రకటించారు.

ఒలింపిక్ స్థాయికి రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో క్రీడాకారులు ఎంపిక అవడానికి ప్రభుత్వం అన్ని రకాల సపోర్ట్ అందించదలచిందని, సాఫ్ట్ బాల్ గేమ్ మరింత ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు, క్రీడల అభివృద్ధికి పునాదిగా నిలిచిపోతాయని, ఏపీని క్రీడలు పరంగా దేశంలో నెంబర్ వన్ గా నిలిపే లక్ష్యాన్ని పొందవచ్చు అని పేర్కొన్నారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!