"మహిళల 33% రిజర్వేషన్ కోసం బిజెపి ఆఫీస్ ముట్టడించిన మహిళా కాంగ్రెస్"
By Ravi
On
ఈ రోజు, మహిళల 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు గారి నాయకత్వంలో మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా, మహిళా కాంగ్రెస్ సభ్యులు బిజెపి ఆఫీస్‌ను ముట్టడి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు గారు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని, మహిళల రిజర్వేషన్ హక్కు కోసం తమ నిరసనను వ్యక్తం చేశారు.
సునీతా రావు మాట్లాడుతూ, "మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది మహిళల సాధికారత కోసం, వారి గౌరవం మరియు సమానత్వం కోసం ముఖ్యమైన అడుగు" అని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా, మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచుకోవాలని ఉద్దేశిస్తోంది.
Tags:
Latest News
05 Apr 2025 19:46:00
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని...