సికింద్రాబాద్ MMTS ట్రెయిన్లో యువతిపై అత్యాచారయత్నం

By Ravi
On


సికింద్రాబాద్, మార్చి 23:

సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్లే MMTS ట్రెయిన్లో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటిరిగా ప్రయాణిస్తున్న యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించగా, ఆమె కదులుతున్న ట్రెయిన్లో నుంచి దూకి తప్పించుకుంది. దూకడం కారణంగా ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

Tags:

Advertisement

Latest News