ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా కఠిన చర్యల కోరిన నాయక్
* ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఒక ఆదివాసి కార్పొరేటర్ అయిన శ్రీమతి సుజాత గారిని అవమానం చేసే పద్ధతిలో మాట్లాడినాడు.
* వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి.
* బెల్లయ్య నాయక్ తేజవత్ చైర్మన్ , ట్రైకర్ గారు
* సుజాత గారి వంటికి వెళ్లి పరామర్శించినారు.
* తనతోపాటు సత్యనారాయణ బుడ్డ ,పాశం అశోక్ గౌడు, నేలపాటి రామారావు,j శ్రీపాల్ రెడ్డి , చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు దుర్గారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మహిళా నాయకురాలు రాజేశ్వరి, భాను , కవిత ,మణిశ్రీ, లత గౌడ్, వరలక్ష్మి హాజరైనారు.
* ఈ సందర్భంగా నాయక్ గారు మీడియాతో మాట్లాడుతూ చట్టపరంగా , రాజ్యాంగబద్ధంగా, సుధీర్ రెడ్డి చేసిన తప్పులకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా కొట్లాడుతామని, సుజాత కుటుంబానికి అండగా నిలబడతామని, తెలియజేశారు .
* ఒకవైపు రాజ్యాంగపరంగా కొట్లాడుతూనే రెండోవైపు సుధీర్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తామని స్పష్టం చేశారు.
* సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు.
* కుల అహంభావంతో, స్త్రీల పట్ల చులకన భావంతో, మగ దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చట్టసభల్లో ఉండడానికి అర్హుడు కాదని , వెంటనే అతన్ని చట్టసభలను తొలగించాలని , సుధీర్ రెడ్డి కి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, రాజ్యాంగ మీద ఆయన చేసిన ప్రమాణానికి ఆయన కట్టుబడి లేడని తెలియజేశారు.
* ఎల్బీనగర్ ప్రజలు, రాష్ట్ర గిరిజనులు ఈ సంఘటన పట్ల స్పందించి సుజాత కుటుంబానికి అండగా నిలబడాలని,
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు
* రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉన్నారని తెలియజేశారు.
* స్థానిక ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండేట్ , రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు ఈ కుటుంబానికి అండగా నిలబడతానని తెలియజేశారని నాయక్ తెలియజేశారు.
త్వరలోనే జాతీయ ఎస్టీ కమిషన్ కు ఢిల్లీకి వెళ్లి కలుస్తామని, అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల్లో సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా కంప్లీట్ చేసి న్యాయాన్ని పొందుతామని నాయక్ తెలియజేశారు.